సెప్టెంబర్‌లో ‘దేవర’.! కరెక్ట్ డెసిషనేనా.?
- June 18, 2024
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీయార్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’. ప్యాన్ ఇండియా స్కేల్‌లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమాని పట్టాలెక్కించడానికే చాలా చాలా టైమ్ తీసుకున్నారు.
ఎలాగోలా పట్టాలెక్కింనుకుంటే, ఆ తర్వాత షూటింగ్ కూడా ఆలస్యమవుతూనే వస్తోంది. ఎన్టీయార్ చాలా కష్టపడుతున్నాడు. సినిమాని అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయాలని.
కానీ, షూటింగ్ కంప్లీట్ కాని పక్షాన ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయలేకపోతున్నామని తాజాగా మేకర్లు ప్రకటించారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీయార్ అభిమానుల్ని పూనకాలకు గురి చేసింది. ఇక రేపో మాపో ‘దేవర’ హంగామా మొదలవుతుందనుకున్న టైమ్‌లో ఇలా పోస్ట్‌పోన్ న్యూస్ బయటికి రావడం ఒకింత ఎన్టీయార్ అభిమానుల్ని కలచివేసిప్పటికీ, లేటైనా లేటెస్ట్‌గానే మా అభిమాన హీరో సినిమా రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి అనుకోకుండా షూటింగ్‌లో దెబ్బలు తగలడం షూటింగ్ లేట్ అవ్వడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, ఆ ఆటంకాన్ని సైతం అధిగమించి షూటింగ్‌ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పటికీ కుదరలేదు.
అందుకే ఇక చేసేదేం లేక ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వచ్చిందట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!







