పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటీ.?
- June 18, 2024
‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయాలనుకున్నారు. ఆ నేపథ్యంలోనే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ఎలాగోలా పూర్తి చేసేశారు. రిలీజ్ చేసేశారు కూడా. అయితే, అదే టైమ్‌లో చాలా సినిమాల్ని ఓకే చేసి పెట్టారాయన.
అందులో మూడు సినిమాలు ఆల్రెడీ సగం షూటింగ్‌లో ఆగిపోయాయ్. ఈ లోపు ఎలక్షన్స్‌లో బిజీ అయిపోవడం, తిరుగులేని మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం.. అన్నీ త్వర త్వరగా జరిగిపోయాయ్.
మరి, ఆయన ఒప్పుకున్న సినిమాల పరిస్థితేంటీ.? ఎమ్మెల్యే హోదాలో వుండి వుంటే, సినిమాలు చేసుకోవడం వీలయ్యేదేమో బాలకృష్ణలాగా. కానీ, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆయె.
బోలెడంత సెక్యూరిటీ, ప్రోటోకాల్.. హంగామా నడుమ ఆయన షూటింగ్‌కి హాజరవ్వడమెలా.? కొన్నిరోజులు, కేవలం కొన్ని రోజులు కేటాయిస్తే పూర్తయిపోయే సిట్యువేషన్‌లో కొన్ని సినిమాలున్నాయ్. కానీ, ఆ కొన్ని రోజులు కూడా కేటాయించలేని పరిస్థితి.
ఓవైపు ఎన్నికల నగారా పీక్స్‌లో వున్న టైమ్‌లోనే ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీరమల్లు’ వంటి చిత్రాల నుంచి సిట్యువేషనల్‌గా పోస్టర్లు కూడా వదిలి తమదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆయా సినిమాల మేకర్లు. మరి ఆ సినిమాల పరిస్థితేంటీ.? పవన్‌తో ఆ సినిమాలు పూర్తి చేస్తారా.? లేక.? ఏం చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.!
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







