‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడుగా.!
- June 18, 2024
‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల తర్వాత హరీష్ శంకర్, మాస్ రాజా రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఎలాగూ రీమేక్ సినిమానే కాబట్టి.. పని కాస్త ఈజీనే అనుకోవచ్చు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘రైడ్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదట్లో వేర్వేరు హీరోల్ని ఈ సినిమాలో అనుకున్నారు.
ఫైనల్‌గా మాస్ రాజా రవితేజ వచ్చి చేరారు ఈ ప్రాజెక్టులోకి. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట. తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఒకటి ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది కూడా. ఎటువంటి డైలాగుల్లేకుండానే కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో కట్ చేసిన ఈ వీడియో నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలా ‘బచ్చన్’కి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మాస్ రాజా విశ్వరూపం చూపించబోతున్నారు ఈ సినిమాలో.
ఎలాగైనా ఈ కాంబోలో హ్యాట్రిక్ పడాలన్న తపన జస్ట్ ఈ టీజర్‌లోనే సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక, రిలీజ్ డేట్ విషయంలోనూ కొంత డిస్కషన్ జరుగుతోంది. ఎలాగూ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా పడడంతో మాస్ రాజా ఆ డేట్స్‌లో ఏమైనా అడ్జస్ట్ అవుతాడేమో చూడాలి మరి. ఒకవేళ అదే జరిగితే, రవితేజ ఫ్యాన్స్‌కి పండగే.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







