ఐరన్ లోపం.! లక్షణాలు గుర్తించడమెలా.?

- June 18, 2024 , by Maagulf
ఐరన్ లోపం.! లక్షణాలు గుర్తించడమెలా.?

శరీరానికి అందాల్సిన  మోతాదులో ఐరన్ అందకపోతే, ఎక్కడ లేని నీరసం నిస్సత్తువ ఆవహిస్తాయ్. ఐరన్ లోపం కారణంగా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడుతుంది. దాంతో, గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంతేకాదు, మెదడుకు కూడా ఆక్సిజన్ సరఫరా తక్కువగా జరుగుతుంది.

తద్వారా తీవ్రమైన తలనొప్పి, చికాకు ఆవహిస్తాయ్. కొందరిలో కాళ్లు, చేతులు చల్లబడిపోతాయ్. శరీరం వుండాల్సిన రంగు కన్నా తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తుంది. కళ్ల కింద చర్మం లోతుకెళ్లిపోయినట్లు కనిపించడం, చిగుల్లు లేత గులాబీ రంగులోకి మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయ్.

ఐరన్ లోపం కారణంగా హెమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐరన్ లోపం వున్న మహిళల్లో చిన్న పనికే నీరసం రావడం, మెట్లు ఎక్కడం వంటివి కష్టతరమవ్వడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

కొన్ని సమయాల్లో మైకం కమ్మి, కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అలాగే చాలా మందిలో గోళ్లు సున్నితంగా మారిపోయి, గోళ్ల చుట్టూ వున్న పోరలు లేచిపోవడం గోళ్లు విరిగిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయ్. ముఖ్యంగా జుట్టు బలం కోల్పోతుంది. విపరీతంగా రాలిపోతుంది. ఈ సమస్యలు కనిపిస్తే, అస్సలు లైట్ తీసుకోకుండా వైద్యుని సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.

దాంతో పాటూ, ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలూ, పాలు, పాల ఉత్పత్తులను రెగ్యులర్‌గా తీసుకుంటుండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com