ఆర్థిక పనితీరు.. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఖతార్

- June 19, 2024 , by Maagulf
ఆర్థిక పనితీరు.. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఖతార్

దోహా: స్విట్జర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) జారీ చేసిన వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇయర్‌బుక్ 2024 ప్రకారం.. .  చాలా అభివృద్ధి చెందిన 67 దేశాలలో ఖతార్‌ 11వ ర్యాంక్‌లో నిలిచింది. గత సంవత్సరం 12వ ర్యాంక్‌లో ఉంది.  ఆర్థిక పనితీరు (4వ స్థానం), ప్రభుత్వ సామర్థ్యం (7వ స్థానం), వ్యాపార సామర్థ్యం (11వ స్థానం), మౌలిక సదుపాయాలు (33వ స్థానం) అనే నాలుగు ప్రధాన అంశాల్లో ఖతార్ ఉన్నత స్థానంలో నిలిచింది. వ్యాపార వాతావరణం మరియు ఖతార్ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వంపై కంపెనీ నిర్వాహకులు, వ్యాపారవేత్తల అభిప్రాయ సేకరణ ఫలితాలతో పాటు స్థానిక స్థాయిలో అందించబడిన సమగ్ర డేటా, సూచికల ద్వారా జరిగిన పరిణామాల ఆధారంగా ర్యాంకులను నిర్ధారించారు.  ఖతార్ ఆర్థిక వ్యవస్థ వినియోగ పన్ను రేటు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు రెండింటిలోనూ మొదటి స్థానంలో ఉంది. అయితే పబ్లిక్ ఫైనాన్స్ ఇండెక్స్‌లో ఇది రెండవ స్థానంలో ఉంది. వ్యాపార సామర్థ్య అంశం విషయానికొస్తే.. కార్పొరేట్ బోర్డుల ప్రభావం, వలసదారుల స్టాక్ రెండింటిలోనూ ఖతార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. అయితే పని గంటల సూచికలో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టర్ కింద, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సబ్‌ఫాక్టర్స్‌లో మరియు ప్రతి 1000 మందికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో ఖతార్ మొదటి స్థానంలో ఉంది.

నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ HE అబ్దుల్ అజీజ్ బిన్ నాసర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా ఖతార్ సాధించిన ఫలితాలను స్వాగతించారు. ఈ అత్యుత్తమ ఫలితాలు ఖతార్ నాయకత్వం తెలివైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఖతార్ సరైన మార్గంలో ఉందని వారు ధృవీకరిస్తున్నారు. మూడవ జాతీయ అభివృద్ధి వ్యూహం 2024-2030లోని అంశాలను అమలు చేయడం ద్వారా ఖతార్ నేషనల్ విజన్ 2030 యొక్క ఆశయాలను సాధించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com