మంగాఫ్ అగ్నిప్రమాదం.. ప్రతి కుటుంబానికి $15,000 పరిహారం

- June 19, 2024 , by Maagulf
మంగాఫ్ అగ్నిప్రమాదం.. ప్రతి కుటుంబానికి $15,000 పరిహారం

కువైట్: విషాదకరమైన మంగాఫ్ భవనం అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి $15,000 (సుమారు 4500 KD) చొప్పున పరిహారం అందజేయబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్లిష్ట సమయంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులను ప్రాసెస్ చేసి బాధితులకు సంబంధించిన రాయబార కార్యాలయాలకు అందజేస్తామని తెలిపారు.  అగ్నిప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాలకు నిధుల పంపిణీని రాయబార కార్యాలయాలు చేపడతాయని అన్నారు. ఈ ఆర్థిక సహాయం బాధితుల కుటుంబాలకు వెంటనే మరియు సమర్ధవంతంగా చేరేలా చేస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com