24 వసంతాలు పూర్తి చేసుకున్న బసవతారకం హాస్పిటల్..

- June 22, 2024 , by Maagulf
24 వసంతాలు పూర్తి చేసుకున్న బసవతారకం హాస్పిటల్..

హైదరాబాద్‌: ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్‌ ప్రారంభిస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు.బసవతారకం ఇండో అమెరికన్‌ కాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ 24వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అలాగే డా.నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బసవతారకం హాస్పిటల్‌ ఎంతో మంది పేదలకు సేవలందిస్తోందని ఆయన తెలిపారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకే ఈ హాస్పిటల్‌ నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థకు అనుమతులపై తన దృష్టికి రాగానే కేబినెట్‌లో చర్చించి పరిష్కరించామని ఆయన వెల్లడించారు.హాస్పిటల్‌ ఛైర్మెన్‌ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి అందరికి ఆదర్శమన్నారు.ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్‌ని తీర్చి దిద్ది కార్పోరేట్‌ తరహా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో బసవతారకం కాన్సర్‌ హాస్పిటల్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com