నేరేడు పండ్లు ఎక్కువగా తింటున్నారా.?
- June 22, 2024
సీజనల్‌గా వచ్చే పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. అయితే, కొన్ని రకాల పండ్లను సీజన్‌లో అయినా సరే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
లేదంటే అవి అనేక రకాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయట. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నేరేడు పండ్లు. ఈ పండ్లు కేవలం సీజన్‌లో మాత్రమే లభిస్తాయ్. ఆయా సీజన్లలో వీటిని ఖచ్చితంగా ఒక్కసారైనా తినాలని చెబుతారు.
అయితే, అతిగా నేరేడు పండ్లు తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్లు అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్ర్టిక్ సమస్యలు అధికమవుతాయట. అలాగే, గొంతు సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు.
అంతేకాదు, మొటిమలు రావడం, ఇతరత్రా చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు ఎక్కువ కావడం వంటి సమస్యలొస్తాయని తాజా సర్వేలో తేలింది.
మలబద్ధకం సమస్య వున్నవాళ్లు ఈ పండ్లను తినకపోవడమే మంచిదని అంటున్నారు. అతి సర్వత్రా వర్జ్యయేత్ అంటారుగా.! అది నేరేడు పండ్ల విషయంలో ఇంకాస్త ఎక్కువే వున్నట్లుంది. సో, తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







