శ్రీవారి దర్శనం,లడ్డూ ధరల్లో మార్పు లేదు: TTD
- June 22, 2024
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పష్టం చేసింది. టీటీడీ దర్శనం, లడ్డు ధరలను సవరించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ కొట్టిపారేసింది. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధర రూ.300 ఉండగా, లడ్డూ ప్రసాదం రూ. 50 ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. అంతేకాదు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
టూరిజం వెబ్‌సైట్ ద్వారా భక్తులకు టిక్కెట్లు బుక్ చేయిస్తామని చెప్పి అందుకు ధర ఎక్కువ అవుతుందని, శ్రీవారి దర్శనం కోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో శ్రీవారి దర్శనానికి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందిస్తామంటూ కొన్ని ఫోన్ నంబర్లతో సమాచారం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం శాఖలకు కొన్ని టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు సంబంధిత టూరిజం ద్వారా ఆయా దర్శన టిక్కెట్లను పొందే సౌకర్యం ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దళారుల మాటలు నమ్మి భక్తులు మోసపోవద్దు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







