ఆమ్‌స్టర్‌డామ్ చేరుకున్న అమీర్

- June 24, 2024 , by Maagulf
ఆమ్‌స్టర్‌డామ్ చేరుకున్న అమీర్

ఆమ్‌స్టర్‌డామ్: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ   అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం ఆమ్‌స్టర్‌డామ్ చేరుకున్నారు.  ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్ట్ షిపోల్‌కు చేరుకున్న అమీర్‌కు అడ్జటెంట్ జనరల్ మరియు మిలిటరీ హౌస్ హెడ్ ఆఫ్ హెచ్‌ఎమ్ కింగ్ రియర్ అడ్మిరల్ లుడ్జర్ బ్రుమ్మెలార్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి హాంకే బ్రూయిన్స్ స్లాట్, ఖతార్ రాయబారి స్వాగతం పలికారు. డచ్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, నెదర్లాండ్స్‌లోని ఖతార్ రాయబార కార్యాలయ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పర్యటన సందర్భంగా పలు కీలక అంశాలపై అమీర్ చర్చలు జరుపనున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com