అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..
- June 12, 2016
అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఔత్సాహికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఇండియా పర్మనెంట్ మిషన్ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, 2014 మిస్ అమెరికా నినా దవులూరి, ఐక్యరాజ్యసమితి ప్రముఖులు టైమ్ స్క్వేర్ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సద్గురు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక సందేశాన్ని ప్రజలకు అందించనున్నారు.అక్కడ ఉన్న స్థానిక భారతీయుల కోసం భారత దౌత్యకార్యాలయం వారం పాటు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా యోగాపై అవగాహన కల్పించనుంది. పాఠశాలలు, ఆలయాలు, జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం, నేవార్క్ విమానాశ్రయంలోను యోగా కార్యక్రమాలను నిర్వహించనుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







