ఏపీ గవర్నర్ కార్యదర్శిగా భాధ్యతలు స్వీకరించిన డా.హరి జవహర్లాల్
- June 24, 2024
విజయవాడ: గవర్నర్ కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి డా. ఎం. హరి జవహర్లాల్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాననీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్ కార్యదర్శిగా డా. హరి జవహర్లాల్ నియమితులయ్యారు.
రాజ్‌భవన్‌కు చేరుకున్న డా.హరి జవహర్‌లాల్‌కు గవర్నర్ సంయుక్త కార్యదర్శి పి.ఎస్. సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి పి.నారాయణ స్వామి, గవర్నర్ ఎడిసిలు మేజర్ దీపక్ శర్మ, రామాంజనేయులు స్వాగతం పలికారు.అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు డాక్టర్ హరి జవహర్‌లాల్‌కు ఆశీర్వచనం అందజేశారు.రాజ్‌భవన్ అధికారులు మరియు సిబ్బంది డాక్టర్ హరి జవహర్‌లాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









