లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈజ్ బ్యాక్.!
- June 24, 2024
విజయశాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె నటించిన పవర్ ఫుల్ సినిమాలే. వైజయంతీ ఐపీఎస్ పాత్ర ముఖ్యంగా ఆమె నటించిన పాత్రల్లో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. అప్పట్లో లేడీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలకు ప్రాణం పోశారావిడ.
అయితే, చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా వున్నారు. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చాలా అవకాశాల్ని కాదనుకున్నారు.
కానీ, ఇప్పుడు మళ్లీ వస్తున్నారు లేడీ సూపర్ స్టార్‌గా విజయ శాంతి. నందమూరి కళ్యాణ్ రామ్ 21 వ చిత్రంలో విజయ శాంతి నటిస్తున్నారన్న విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ధృవీకరించింది.
ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పాత్రను సైతం పరిచయం చేస్తూ స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ అందించింది. ఆమెకు కొట్టిన పిండి అయిన ‘వైజయంతీ ఐపీఎస్’ పాత్రలో ఈ సినిమాలో విజయ శాంతి కనిపించబోతున్నారని లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అర్ధమవుతోంది.

ఇంకేముంది.! ఈ సినిమాకి విజయ శాంతి మెయిన్ అస్సెట్ కానుందని అర్ధం చేసుకోవచ్చు. ప్రవీణ్ చిలుకూరి దర్శకత్వం విహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







