కమల్ హాసన్ డబుల్ ధమాకా.!
- June 24, 2024
విశ్వ నటుడు కమల్ హాసన్ సినిమా అంటే అదో క్రేజ్. ఇక, ఆయన నట విశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. ఎన్నో దృశ్య కావ్యాలు ఆయన నుంచి వచ్చాయ్. లేటెస్ట్‌గా ఈ వయసులోనూ ఆయన నటించిన ‘విక్రమ్’ సినిమా రికార్డులు కొల్లగొట్టింది.
ఇదే జోష్‌తో ఓ వైపు ‘ఇండియన్ 2’ సినిమా పూర్తి చేసేశారాయన. అలాగే మరోవైపు ప్రపంచం ఎదురు చూస్తున్న ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మెయిన్ లీడ్ విలన్ రోల్ పోషిస్తూ అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్నారాయన. ఇక, ‘కల్కి’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంతకు రెండు రోజులు ముందే ఆయన నటించిన ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. 2 నిమిషాల 30 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్‌పై ఆసక్తి నెలకొంది. ఇంతవరకూ కొన్ని పోస్టర్లు, ఓ చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు.
ట్రైలర్ వస్తే.. సినిమాపై ఓ అంచనాకి రావచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రమిది. విభిన్న గెటప్స్‌లో కమల్ హాసన్ కనిపించబోతున్నారు ఈ సినిమాలో. సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







