కిద్దియాలో ఆర్ట్స్ కేంద్రం ఆవిష్కరణ
- June 25, 2024
రియాద్: కిద్దియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (QIC) ఒక వినూత్నమైన ఆర్ట్స్ కేంద్రాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కొత్తగా ప్రకటించిన కిద్దియా సిటీ మొదటి సాంస్కృతిక ప్రాజెక్ట్స్ లో భాగం. ఈ కేంద్రాన్ని ప్రతి సంవత్సరం 800,000 సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీ-వినియోగ గేమింగ్, ఎస్పోర్ట్స్ జిల్లా, మల్టీ-స్పోర్ట్స్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్టేడియం, మోటార్‌స్పోర్ట్ ట్రాక్, డ్రాగన్ బాల్ థీమ్ పార్క్ మరియు సౌదీ అరేబియాలో మొదటి వాటర్ థీమ్ పార్క్ అయిన అక్వారేబియా ఉన్నాయని కిద్దియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్దావూద్ తెలిపారు. "కిద్దియా సిటీ కేవలం వినోదం క్రీడల నిలయం మాత్రమే కాదు. సౌదీ సంస్కృతిని పరిరక్షించడం, ప్రచారం చేయడంలో కూడా ఇది అగ్రగామిగా ఉంది. ఈ కారణంగా, మేము దీనిని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. కిద్దియా నగరానికి కిద్దియా ఆర్ట్స్ కేంద్రం ఆవిష్కరిస్తున్నము." అని వివరించారు.
ఈ కేంద్రం ప్రతి సంవత్సరం 260 కంటే ఎక్కువ ఇండోర్ మరియు అవుట్డోర్ షోలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. మూడు హాళ్లలో 3,000 కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. 360-డిగ్రీ అనుభవాన్ని అందిస్తాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







