పావురం సాహసం
- July 03, 2015
పూర్వం గోదావరి ఒడ్డున ఒక పురాతన దేవాలయం ఉండేది. దాని గోపుర ద్వారంలో అనేక రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. అదే గోపురం వద్ద ఒక పావురాల జంట కూడా ఉండేది. ఆ జంట పావురాలలో ఆడపావురం కొంత ముందు జాగ్రత్త కలది. మగపావురం మాత్రం అస్సలు జాగ్రత్త లేకుండా ప్రమాదం పొంచి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ గోపురం మీద పక్షులన్నీ వేరే చోటకి వలస వెళ్లిపోతున్నాయి. ఈ పావురాల జంట తమ గూటి నుండి బయటికి వచ్చి చూడగా గోపురంపై ఒక్క పక్షి కూడా కనిపించలేదు. దానికి కారణం ఆ గోపురంపై ఒక డేగ మాటేసుకుని తిరుగుతూ ఉండడం కనిపించింది. ఓహో ఇదా సంగతి అని ఆడపావురం మగపావురంతో మనం కూడా ఈ గోపురం వదిలి ఎక్కడికైనా సురక్షిత ప్రదేశానికి ఎగిరి వెళ్లపోదాం. ఆ డేగ వెళ్లినాక మళ్లీ మన గూటికి చేరుకుందాం అని ముందు చూపుతో చెప్పగా..అందుకు ఆ మగపావురం ఎందుకు అలా భయపడుతున్నావు. ఆ డేగ ఏమంత మన కన్నా గొప్పదనీ.. ఏం మనకున్నట్టే దానకీ వాడైన ముక్కు ఉంది. మనకున్నట్టే బలమైన గోళ్లున్న కాళ్లున్నాయి. అది పొడిస్తే మనకు రక్తం వచ్చినట్లే దానికీ రక్తం వస్తుంది. దానికి పోయే కాలం వచ్చే ఇటు వచ్చింది. రానీ..రానీ దాన్ని చంపి పారేస్తాను. నువ్వు అనవసరంగా భయం పెట్టుకోకు అని వారించింది. దాంతో ఆడపావురం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. మర్నాడు ఉదయం మగపావురం గూటి నుండి బయటికి వచ్చింది. వచ్చీ రాగానే డేగ తన కాళ్లతో తన్నుకుని ఎగరేసుకెళ్లిపోయింది. ఒంటరిదైన ఆడపావురం ఏం చేయలేక బాధపడుతూ ఉండిపోయింది.
నీతి : అందుకే అనువుగాని చోట అధికులమనరాదు అనేది ఈ కథలోని నీతి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









