నుహాసిని నూతన చిత్రం 'శివగామి'
- June 12, 2016
బాహుబలిలో పాపులర్ అయిన పాత్ర శివగామి. శివగామి అంటే రమ్యక్రిష్ణనే గుర్తుకు వస్తారు. అయితే ఇప్పుడీ టైటిల్ సుహాసినికి వెళ్ళిపోయింది. సుహాసిని నటించిన కన్నడ చిత్రం నాని. తెలుగులో "శివగామి"గా రానుంది. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, జై జగదీశ్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "బేబి సుహాసిని, సీనియర్ సుహాసినిల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. తెలుగులో ప్రముఖ గాయని గీతామాధురి, ఫేమస్ సింగర్ "గజల్" శ్రీనివాస్ కుమార్తె సంస్కృతీ "శివగామి"లో పాడడం విశేషం.
ఈనెల 15న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. హారర్ సినిమాల్లో "శివగామి" సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకముంది" అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







