ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
- June 26, 2024
న్యూ ఢిల్లీ: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.గవర్నర్ కృష్ణ భగవానుని 'విరాట్ స్వరూప్' విగ్రహాన్ని ప్రధానికి బహూకరించారు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి గా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.హర్యానా చరిత్ర, సామాజిక-సాంస్కృతిక వారసత్వం,రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ ప్రధాని మోదీతో చర్చించారు.
గవర్నర్ సతీమణి బండారు వసంత, ఆమె కుమార్తె బండారు విజయలక్ష్మి, అల్లుడు డాక్టర్ బి జిగ్నేష్ రెడ్డి,బండారు శివ శంకర్,గవర్నర్ మనవరాళ్లు యశోధర రెడ్డి,వేదాంషి రెడ్డి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మిస్ యశోధర మిస్ వేదాన్షి కూడా ప్రధాని కోసం హిందీలో రెండు పాటలు పాడారు.ఈ పాటలు – “మాం సే జ్యాదా మాత్రభూమి కో జిసనే మాన్ దియా, ఖుద్ కా జీవన్ భీ జైసనే’’ దిల్ పే హాథ రఖ్ కే యే కసమ్ లే హమ్ సభీ, న జుకేగా దేశ్ అపనా న జుకేంగే హమ్ కభీ!'' వారి పాటలకు ముగ్ధులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారిని అభినందించి ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









