‘గేమ్ ఛేంజర్’ రేంజ్ మారిపోయిందిగా.!
- June 28, 2024
ఇటీవలే వచ్చిన ‘ఇండియన్ 2’ ట్రైలర్‌కి ఏ రేంజ్‌లో హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క ట్రైలర్‌తో సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.
మరోవైపు ‘ఇండియన్ 2’ సినిమాతో పాటూ, ‘గేమ్ ఛేంజర్’ పైనా అంచనాలు మారిపోయాయ్. ఈపాటికే రావల్సిన సినిమా ఆలస్యమవుతుండడంతో అనేక రకాల డైలమాలు ఈ సినిమా మేకింగ్‌పై.
కానీ, ‘ఇండియన్ 2’ ట్రైలరే ‘గేమ్ ఛేంజర్’ సినిమా స్వరూపాన్ని టోటల్‌గా మార్చేసింది. ఎంత లేట్‌గా వస్తేనేం, ఏం రేంజ్‌లో వుండబోతోందో.. ఇప్పుడిదే మెగా అభిమానుల అభిప్రాయం.
శంకర్‌పై ఎంతో నమ్మకముంది. కానీ, ప్రస్తుతం నడుస్తున్న సినిమాల సినారియోతో ఎలాంటి డైరెక్టర్ అయినా ఎక్కడోచోట ఏధో రకంగా తప్పులు చేసేస్తూనే వున్నాడు. కానీ, శంకర్ అలా కాదు, దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి క్యారెక్టర్ సేనాపతి (ఇండియన్ మొదటి పార్ట్‌లో కమల్ హాసన్ క్యారెక్టర్) క్యారెక్టర్‌ని అందుకు ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి అనేలా తీర్చిదిద్దడంలోనే శంకర్ మేకింగ్ గొప్పతనం అర్ధమైపోయింది.
అలాంటిది మెగా పవర్ స్టార్‌ని అందులోనూ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో ఇంకే స్థాయిలో చూపించబోతున్నాడో.! అంటూ అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







