శ్రీలీల ‘న్యూడ్’ ప్రచారం.!
- June 28, 2024
అదేంటీ.! శ్రీలీల ఏంటీ.! న్యూడ్ ప్రచారమేంటీ.? అనుకుంటున్నారా.? ఆగండాగండి. న్యూడ్ అనేది ఓ వాణిజ్య ప్రచారాల కంపెనీ. ఒక రకమైన చర్మ సంబంధిత క్రీమ్‌కి సంబంధించిన యాడ్‌లో శ్రీలీలను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నారట.
ఈ బ్రాండ్ స్కిన్ క్రీమ్‌ని ప్రచారం చేయడంలో ప్రస్తుతం శ్రీలీల బిజీగా వుందంటున్నారు. అదేనండీ ఈ యాడ్ షూట్‌లో శ్రీలీల నటిస్తోందట. ‘ధమాకా’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాని చాలా తక్కువ టైమ్‌లోనే దక్కించేసుకుంది శ్రీలీల.
అయితే, అంతే వేగంగా ఐరెన్ లెగ్ ముద్ర కూడా వేయించేసుకుంది. దాంతో, దక్కించుకున్న స్టార్‌డమ్ డైలమాలో పడిపోయింది. ఒప్పుకున్న ప్రాజెక్టులే కొన్ని వెనక్కి వెళ్లిపోయాయ్ కూడా.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పక్కాగా అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే వుంది. కానీ, ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యేది కాదు. విజయ్ దేవరకొండ తదితర హీరోలతో నటించాల్సి వున్నప్పటికీ ఆయా ప్రాజెక్టుల్ని కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే ఎత్తుకుపోయిందన్న టాక్ వుంది.
సో, సినిమాల సంగతెలా వున్నా.. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమో, కమర్షియల్ యాడ్స్‌పై ఎక్కువగా సైన్ చేస్తోందట. ఇప్పటికే శ్రీలీల పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







