కల్కి పార్ట్ 2 ఆల్రెడీ 60 శాతం షూటింగ్ అయిపొయింది..
- June 29, 2024
ప్రభాస్ కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నాగ్ అశ్విన్ అదిరిపోయే రేంజ్ లో సినిమా అతీశారని అంటున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. కల్కి మొదటి రోజే 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. రెండు రోజుల్లో 298.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
అయితే కల్కి సినిమాకు పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించి వాటిల్లో మరిన్ని సినిమాలు ఉండొచ్చని కల్కి సినిమా క్లైమాక్స్ లో చెప్పేసారు. అలాగే కల్కి సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ – నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో కల్కి పార్ట్ 2 వర్క్ మరో 10 రోజుల్లో మొదలవుతుందని తెలిపారు.
తాజాగా నిర్మాత అశ్వినీదత్ పలువురు పత్రికా రిపోర్ట్రర్స్ తో మాట్లాడారు. ఈ చర్చలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. ఈ క్రమంలో కల్కి పార్ట్ 2 గురించి నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 సినిమా 60 శాతం షూటింగ్ అయింది. త్వరలో మిగిలిన షూటింగ్ మొదలుపెడతాం. షూట్ అయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం. పార్ట్ 3 గురించి ఇంకా ఆలోచించలేదు అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ అయిపోయిందని నిర్మాత అశ్వినీదత్ చెప్పడంతో కల్కి పార్ట్ 2 సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







