కొండగట్టుకు జనసేనాని..గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం..
- June 29, 2024
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండ గట్టుకు స్టార్ట్ అయ్యారు. ఈక్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ క రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు వెళ్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు కూడా ప్రత్యేక భద్రతలను చేపట్టారు. ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేతకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. భారీగా గజమాలను ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ అక్కడికి చేరుకొగానే గజమాలతో స్వాగతం తెలిపారు. ఇదిలా ఉండగా.. తమ అభిమాన నటుడిని చూసి, పవన్ అభిమానులు ఫుల్ జోష్ తో నినాదాలు చేశారు. అంతేకాకుండా.. ఫోటోలు దిగుతూ..సెల్ఫీలు దిగుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పవన్ కు గజమాల సమర్పించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కాసేపు.. సిద్దిపేటలో తన అభిమానులతో మాట్లాడి.. ఆతర్వాత కొండగట్టుక పయనమయ్యారు. మరోవైపు ఒకవైపుశనివారం వీకెంట్ కావడంతో కొండ గట్టులో రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో జనసేన ఫ్యాన్స్, పవన్ అభిమానులు భారీగా ఇప్పటికే కొండ గట్టుకు చేరుకున్నారు. రెండు వేల మందితో పోలీసులు భద్రతను చేపట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు..సాధారణ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు అంజన్న ఆలయంలో పూజలు చేశాక, చేనెత కార్మికులతో, జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమౌతారని తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం తిరిగి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వెళ్లిపోనున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







