నకిలీ హజ్ ఆపరేటర్స్ ఉన్నారు జాగ్రత్త
- June 12, 2016
హజ్ అండ్ ఉమ్రా ఎఫైర్స్ హై కమిటీ, సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడే నకిలీ హజ్ ఆపరేటర్లున్నారంటూ హెచ్చరికలు జారీ చేసింది. అల్ హజ్ అల్ అక్బర్, అన్వర్ అల్ జనా, బు రహమా, అల్ షాజి, అల్ మసారా, హజ్ కారవాన్, అల్ ముయాసర్, అల్ మర్జౌక్ కారవాన్, అన్వర్ అల్ సాజద్, అల్ ఫెర్దావ్స్ (ప్యారడైజ్), అల్ రయా, అల్ ఘోఫ్రాన్ అల్ అబర్ పేర్లతో సోషల్ మీడియా ద్వారా హజ్ యాత్రికుల్ని మోసం చేస్తున్నారని ఈ హెచ్చరికల్లో కమిటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ హజ్ టూర్స్ పేరుతో మోసం చేసేవారి పట్ల చట్ట పరంగా కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు వెల్లడించారు. అధికారిక ఆపరేటర్స్ ద్వారా మాత్రమే ముస్లిం యాత్రీకులు హజ్, ఉమ్రా యాత్రలకు వెళ్ళాల్సిందిగా వారు సూచించారు. ఇస్లామిక్ ఎఫైర్స్ వెబ్‌సైట్‌ని సంప్రదించి, హజ్, ఉమ్రాకి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు అధికారులు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







