కొత్తగా 126 మెడికల్ ఫెసిలీటీస్ లైసెన్సులు
- June 12, 2016
2016 ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 126 కొత్త మెడికల్ మరియు ఫార్మాస్యూటికల్స్ సౌకర్యాలకు సంబంధించి లైసెన్సులను పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. ఇందులో 22 మల్టీ స్పెషాలిటీ మెడికల్ సెంటర్స్ మరియు క్లినిక్స్ ఉండగా, 58 ఫార్మసీలు, 37 మెడికల్ వేర్‌హౌస్‌లు, ఆరు మెడికల్ ఆఫీసులు, 2 ఫార్మాస్యూటికల్ ప్లాంట్లు ఉన్నాయని వారు చెప్పారు. పబ్లిక్ పాలసీ అండ్ లైసెన్సింగ్ సెక్టార్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ మరియు మెడికల్ లైసెన్సింగ్ కమిటీ వైస్ ఛైర్మన్, అసిస్టెండ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అమీన్ అల్ అమిరి మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన మెడికల్ పెసిలిటీస్ ద్వారా ప్రైవేట్ రంగంలో వైద్యాన్ని మరింత ప్రోత్సహించినట్లవుతుందనీ, తద్వారా పారదర్శకంగ వైద్య సేవలు అందడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. కాగా, 11 హెల్త్ ఫెసిలిటీస్, అలాగే ఐదు ఫార్మసీలు తాత్కాలింగా (1 నెల నుంచి 6 నెలల పాటు) రద్దు మూసివేయడం జరిగిందనీ, నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది గడచిన ఐదు నెలల్లో నిర్వహించిన 1097 తనిఖీల్లో వీటిని గుర్తించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







