జీవితంలో రిస్క్ తీసుకోవాలి: అదనపు డీజీపీ మహేష్ భగవత్
- June 29, 2024
హైదరాబాద్: జీవితంలో రిస్క్ తీసుకోవాలని అదనపు డీజీపీ మహేష్ భగవత్ యువతకు పిలుపునిచ్చారు.రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే విజేతలు అవుతారని, లేదంటే అనుభవజ్ఞులు అవుతారని సూచించారు.
రామకృష్ణ మఠంలో జరుగుతున్న 'శౌర్య' శిబిరాన్ని సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యూపీఎస్సీ విద్యార్థులకు ఇంటర్వ్యూని ఎదురుకునే విషయంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 2024లో 1016 మంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వగా 216 మంది క్వాలిఫై అయ్యారని, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్య ౩వ రాంక్ సాధించారని ఆయన తెలిపారు. ఇంటర్వ్యూ విషయంలో కోచింగ్ కోరుకునే పేద విద్యార్థులు 9440700105 వాట్సాప్ నెంబర్కు వివరాలు పంపాలని మహేష్ భగవత్ సూచించారు.
'శౌర్య' శిబిరంలోని విద్యార్థులకు ఆయన 'టైం మేనేజ్మెంట్', 'స్ట్రెస్ మేనేజ్మెంట్' పై సూచనలు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ సమాజానికి టెక్నాలజీతో పాటు శ్రేష్ఠులైన యువతీయువకుల అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వామి వివేకానంద బోధనలు అనుసరిస్తూ జీవితాలను ఉద్ధరించుకోవాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







