T20: విశ్వవిజేతగా భారత్..

- June 30, 2024 , by Maagulf
T20: విశ్వవిజేతగా భారత్..

అమెరికా: టీ20 ప్రపంచకప్‌లో ఒక్క ఓటమి లేకుండా దూకుడుగా ఆడిన భారత్‌ తుది పోరులోనూ అదే ప్రదర్శనను కొనసాగించి ప్రపంచప్‌ను చేజిక్కించుకుంది. ఎట్టకేలకు టీమిండియా 17ఏళ్ల నిరీక్షణ నేటితో ముగిసింది.ఎంఎస్ ధోని సారథ్యంలో చివరిసారిగా భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన 17 ఏళ్ల తర్వాత రోహిత్ సేన రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ సఫారీలను చిత్తుగా ఓడించి 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీలుగా విఫలమయ్యారు. భారత్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (18/2), హార్దిక్ పాండ్యా (20/3), అర్ష్‌దీప్ సింగ్ (20/2) విజృంభించి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com