'మా' వేడుకల్లో చిరు స్టెప్పులు..
- June 13, 2016
: త్వరలో వెండితెరపై అభిమానులను కనువిందు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి జోరుగా స్టెప్పులేశారు. ఆదివారం హైదరాబాద్ హెచ్ ఏసీసీలో జరిగిన సినీ మా అవార్డ్స్ వేడుకలో ఆయన సందడి చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ సాంగ్ కు చిరంజీవి వీర లెవల్ లో ఇరగదీశారు. చాలా రోజుల తర్వాత ...అదీ ప్రత్యక్షంగా చిరు డాన్స్ చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
చిరంజీవి డాన్స్ చేస్తున్నసేపూ అభిమానుల కేరింతలు, విజిల్స్ లో మోత మోగించారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన నృత్యం టాక్ ఆఫ్ ది న్యూస్‌గా మారింది. కాగా అంతకు ముందు సునీల్, శ్రీకాంత్, సాయి ధరమ్ తేజ్,నవదీప్... తదితరులు స్టేజ్ మీదకు వచ్చి ఓ స్టెప్ వేయాలంటూ చిరంజీవిని కోరడంతో...
వద్దు వద్దూ అంటూనే చివరకు వాళ్లతో కలిసి గ్యాంగ్ లీడర్ అంటూ నృత్యం చేశారు. కాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు' చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ మూవీ 'కత్తి' ని మెగాస్టార్ 150 సినిమాగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.
కాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మనస్సును కదిలించే రైతుల కథే 150వ చిత్రమని, అభిమానులు కోరుకునే అంశాలతో పాటు, చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుందని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు. ఇక మా టీవీ ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా తెలుగు సినిమాలోని వివిధ శాఖల వారిని అవార్డులతో సత్కరించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









