రజనీకాంత్ నిర్ణయం కారణంగా 5 కోట్ల రూపాయలు అదా..

- June 13, 2016 , by Maagulf
రజనీకాంత్   నిర్ణయం కారణంగా  5 కోట్ల రూపాయలు అదా..

ప్రస్తుతం రజనీకాంత్ నటించిన మూవీ కబాలి. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. కబాలి మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. 'కబాలి' టీజర్ విడుదల నాటి నుండి, ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోవటంతో...ఈ మూవీ కచ్ఛితంగా హిట్ ని సాధించాలని రజనీకాంత్ సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ప్రతి మూవీ రిలీజ్ కి రజనీకాంత్ కొన్ని నమ్మాకాలను పాటిస్తాడు. అలా తనకి ఉన్నఆ సెంటిమెంట్స్ ని ఫాలో అయిన తరువాతనే మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తారంట. అయితే ఈ సారి రజనీకాంత్, కాబాలి మూవీ విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ని అన్నీ భాషల్లో రిలీజ్ చేసేందుకు రజనీకాంత్ డేట్స్ ని చిత్ర యూనిట్ తీసుకుంది. కానీ రజనీకాంత్ మాత్రం చివరినిముషంలో తన మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ని భారీగా చేయకూడదని, ప్రస్తుతం సినిమాకి క్రేజ్ ఉండటంతో ఆడియో ఫంక్షన్ ని నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని సూచించాడట. అందుకే యూఎస్‌ నుండి రావాల్సిన రజనీ, ఇండియాకి రాకుండానే ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసేలా చేశారు. రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆడియో ఫంక్షన్స్ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తంలో దాదాపు 5 కోట్ల రూపాయలు మిగిలినట్టే అని అంటున్నారు. ఈ మొత్తాన్ని మూవీ డిజిటల్ ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మళయాలంతో పాటు హిందీలోనూ డబ్ అయిన కారణంగా ఒకేసారి దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనూ మంచి నమ్మకం ఉందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com