వావ్ నానీ.! వాట్ ఏ క్రేజీ కాంబినేషన్.!
- July 04, 2024
టాలీవుడ్‌లో దర్శకుల యందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వేరయా అంటే అతిశయోక్తి కాదేమో. చేసినవి తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ కథలను ఎంచుకుంటుంటాడు శేఖర్ కమ్ముల. వాటిని తెరకెక్కించే విధానం కూడా చాలా అద్భుతంగా అందంగా వుంటుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారట.
ఈ కాంబినేషన్ తెలియగానే వావ్ వాట్ ఏ క్రేజీ కాంబినేషన్ అంటున్నారు సినీ మేధావులు. శేఖర్ కమ్ముల డైరెక్టన్‌లో నాని నటించడం ఇదే తొలిసారి. కానీ, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సూపర్బ్‌గా వుంటుందని అప్పుడే అంచనాలేసేస్తున్నారు అభిమానులు.
ఏషియన్ సునీల్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది. ఈ లోపే శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ చిత్రం, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలు పూర్తి కానున్నాయ్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







