కృతి శెట్టికి మరో ‘లక్కీ’ ఆఫర్.?
- July 04, 2024
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టికి ఈ మధ్య ఏమంత కలిసి రావడం లేదు. అయినా అరా కొరా అవకాశాలతో నెట్టుకొచ్చేస్తూనే వుంది. కెరీర్ మొదట్లో బిజీగా సినిమాలు చేసిన కృతి శెట్టి, ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఇటీవలే ‘మనమే’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని కొత్తగా పలకరించింది.
అయితే, ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది ఈ సినిమాతో కూడా కృతి శెట్టి. దాంతో, మళ్లీ రేస్‌లో కృతి శెట్టి వెనకబడ్డట్లే అనుకున్నారంతా. కానీ, మరో ఆఫర్ కృతి శెట్టి టాలెంట్‌ని వెతుక్కుంటూ వచ్చింది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాని మలయాళంతో పాటూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ రూపొందించబోతున్నారట. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట.
అలాగే, రానా నిర్మాణ భాగస్వామ్యం కూడా వహించబోతున్నారనీ తెలుస్తోంది. రానాతో పాటూ, దుల్కర్ సల్మాన్ కూడా నిర్మాణంలో భాగం కానున్నారట. మవుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







