వెంకీ-అనిల్ రావిపూడి కాంబో మూవీ ఫస్ట్ లుక్ చూశారా.?

- July 04, 2024 , by Maagulf
వెంకీ-అనిల్ రావిపూడి కాంబో మూవీ ఫస్ట్ లుక్ చూశారా.?

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో క్రేజీ చిత్రం రాబోతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ భలే ఇంట్రెస్టింగ్‌గా వుంది.

అనిల్ రావిపూడి సినిమాలంటే హిలేరియస్‌గా వుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సారి ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ డిఫరెంట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లా తోస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్‌ని ఎక్స్ కాప్ (మాజీ పోలీస్ ఆఫీసర్)గా చూపించబోతున్నాడు.

అలాగే ఆయనకు ఓ గాళ్ ప్రెండ్.. ఆవిడ కూడా మాజీనే. ఎక్స్‌లెంట్ వైఫ్ కూడా వుంది. ఇలా ‘ఎక్స్.. ఎక్స్.. ఎక్స్..’ మూడు ఎక్స్‌ల ట్రైయాంగిల్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించబోతున్నాడు అనిల్ రావిపూడి.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఓ రోజా పువ్వు, మంగళ సూత్రం, గన్ చూపించారు. ఇలాంటి కథలు బేసిగ్గా వెంకటేష్‌కి బాగా నప్పుతాయ్. అదీ అనిల్ రావిపూడి చేతిలో పండే ఫన్ ఇంకా అదిరిపోతుంది. సో, ఈ డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టై‌నర్ కోసం ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.

అన్నట్లు ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత కాగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్.. వెంకీకి జోడీగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com