తారక్-ప్రశాంత్ నీల్ అప్పుడే మొదలెట్టేస్తారా.?
- July 04, 2024
గ్లోబల్ స్టార్ ఎన్టీయార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సిన సంగతి తెలిసిందే. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడనుకున్నారు.
కానీ, అప్పటికే ఎన్టీయార్ కమిట్ అయిన ‘దేవర’ సినిమా వుండడంతో ఆ సినిమాని పూర్తి చేసే పనిలో వున్నాడు ఎన్టీయార్. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది.
అలాగే ఎన్టీయార్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ కూడా ఓ కొలిక్కి వచ్చేసింది. దాంతో, ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందనీ సమాచారం. అన్నీ కలిసొస్తే ఈ సినిమాని సెప్టెంబర్లో స్టార్ట్ చేసేందుకు ఎన్టీయార్ అండ్ ప్రశాంత్ నీల్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక, ‘దేవర’ విషయానికి వస్తే, ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయ్.
అలాగే, త్వరలో సెకండ్ సింగిల్ కూడా వదిలేందుకు కొరటాల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







