విటమిన్ ట్యాబ్లెట్ల వాడకం.! మీకీ విషయాలు తెలుసా.?

- July 04, 2024 , by Maagulf
విటమిన్ ట్యాబ్లెట్ల వాడకం.! మీకీ విషయాలు తెలుసా.?

శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువ. అనేక రకాల జీవక్రియలు జరగాలన్నా.. శరీరం ఉత్సాహంగా ఉరకలేస్తూ వుండాలన్నా ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా వుండాలన్నా విటమిన్ల అవసరం శరీరానికి చాలా కీలకం.

అయితే, విటమిన్లు తక్కువయితే ఏం చేయాలి.? వైద్యుల సూచన అవసరం లేకుండానే కొందరు విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడేస్తుంటారు. అయితే, కొంత వరకూ విటమిన్ లోపాన్ని మందులతో కవర్ చేసుకోవచ్చు. కానీ, అదో అలవాటుగా మారితేనే కష్టమని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ పిల్స్ తీసుకోవడం కన్నా.. విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం వుత్తమం. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, చిరు ధాన్యాల్ని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్లన్నీ అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

క్యారెట్, బీట్ రూట్ వంటి దుంప కాయగూరల్ని తీసుకోవడం.. అలాగే పాలకూర, తోటకూర, గోంగూర, చుక్క కూర వంటి ఆకుకూరల్ని వారంలో కనీసం మూడు సార్లయినా తీసుకోవాలి.

అలాగే రాగులు, సజ్జలు, జొన్నలు తదితర చిరుధాన్యాల్ని (మిల్లెట్స్) కూడా తరచూ కాకున్నా అప్పుడప్పుడూ అయినా ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే జామ కాయలతో సహా అన్ని రకాల పండ్లను తింటుండాలి. ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకుంటే విటమిన్ల లోపమన్న సమస్యే దరి చేరదన్నది తాజా సర్వేలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com