ఘానాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- June 13, 2016
ఆఫ్రికా దేశమైన ఘానా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉగ్రవాదంపై స్పందించారు. దానికి ఎలాంటి సరిహద్దులూ లేవని దేశాలన్నీ సమష్టిగా దాన్ని రూపుమాపడానికి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఘానాలో పర్యటించనున్న ప్రణబ్.. ఆ దేశాధ్యక్షుడు జాన్ ద్రామని మహమా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 'ఆఫ్రికా' పేరుతో రాసిన గీతాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. .ఉగ్రవాదం మానవాళికి శాపంగా మారిందన్నారు.దీనికి సరిహద్దులు లేవని వినాశనకర సిద్ధాంతాలు విస్తరించకూడదని ఆకాంక్షించారు. ప్రపంచమంతా ఏకమై దీన్ని సవాలుగా తీసుకుని.. నామరూపాలు లేకుండా చెయ్యాలన్నారు. ప్రస్తుత సమయంలో ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయన్నారు. సరైన అవకాశాలు ఇస్తే భారత వ్యాపారవేత్తలు ఘానాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఘానాకు ఉన్న శక్తి వారందరికీ బాగా తెలుసునని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







