తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

- July 06, 2024 , by Maagulf
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. జులై 9,16వ తేదిలలో శ్రీవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఈ నెల 9వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,16వ తేది ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఇక ఈ నెల 18వ తేదీన అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది.

ఇదిలా ఉంటె తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 775 మంది భక్తులు కాగా.. 25, 126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3. 41 కోట్లు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com