షార్జాలో ఉచిత పార్కింగ్‌

- July 07, 2024 , by Maagulf
షార్జాలో ఉచిత పార్కింగ్‌

షార్జా: జూలై 7 (ఆదివారం) ఇస్లామిక్ న్యూ ఇయర్ (హిజ్రీ న్యూ ఇయర్) సందర్భంగా పబ్లిక్ పార్కింగ్ ఉచితం అని అధికారులు శనివారం ప్రకటించారు. అయితే, ఈ మినహాయింపు ఏడు రోజుల చెల్లింపు పబ్లిక్ పార్కింగ్ జోన్‌లకు వర్తించదని పేర్కొంది. ఇవి వారం పొడవునా మరియు అధికారిక సెలవు దినాలలో పనిచేస్తాయని, నీలం పార్కింగ్ సమాచార సంకేతాల ద్వారా గుర్తించబడతాయని షార్జా మునిసిపాలిటీ తెలిపింది.  

ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల క్రితం యూఏఈ అధికారులు ఒకరోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొహర్రం 1 సెలవుదినంగా ప్రకటించింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జూలై 7 కూడా వేతనంతో కూడిన సెలవు ఇచ్చారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com