2024 మొదటి త్రైమాసికంలో ఒమన్ GDP వృద్ధి

- July 08, 2024 , by Maagulf
2024 మొదటి త్రైమాసికంలో ఒమన్ GDP వృద్ధి

మస్కట్: ఒమన్ స్థూల దేశీయోత్పత్తి(GDP) ప్రస్తుత ధరల ప్రకారం 0.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR10.44 బిలియన్లకు చేరుకుంది(2023లో అదే కాలంలో OMR10.36 బిలియన్లతో పోలిస్తే).  నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముడి చమురు కార్యకలాపాలు OMR2.996 బిలియన్లు, 4.4 శాతం తగ్గాయి. అయితే సహజ వాయువు కార్యకలాపాలు 0.1 శాతం తగ్గి OMR524.40 మిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో చమురుయేతర కార్యకలాపాలు 2023 అదే త్రైమాసికం చివరినాటికి OMR6.92 బిలియన్లతో పోలిస్తే 2024 మొదటి త్రైమాసికం చివరిలో OMR7.18 బిలియన్లకు 3.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం పారిశ్రామిక కార్యకలాపాలు 2023 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR1.91 బిలియన్లతో పోలిస్తే 2024 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR2.01 బిలియన్లకు చేరుకున్నాయి. వ్యవసాయం, అటవీ మరియు చేపలు పట్టే కార్యకలాపాలు OMR277 మిలియన్లకు చేరుకోగా, సేవా రంగ కార్యకలాపాలు OMR 4.89 బిలియన్ కి చేరుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com