యూపీని ముందుకు నడిపించేందుకు తాము సిద్ధం--మోదీ
- June 13, 2016
యూపీని ముందుకు నడిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో పాటు గంగా నది కృప కూడా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఆయన యూపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత బీజేపీ నిర్వహించిన అత్యంత భారీ సభ ఇది. ఈ సభతో ప్రచార పర్వానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీలో పార్టీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పరికర్, ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు.గత రెండేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని, తాను ఏ దేశం వెళ్లినా ఏదో ఒక ప్రయోజనం చేకూరుతోందని మోదీ చెప్పారు. అయితే ఆ ఘనత మోదీది కాదని..
భారతదేశానిదని ఆయన అన్నారు. ఇక గంగానది ఒక నది కాదని.. అది ఒక ఆలోచనా స్రవంతి అని చెప్పారు. ప్రపంచం మన దేశం గురించి మాట్లాడుతోందంటే అందుకు ఉత్తరప్రదేశే కారణమని తెలిపారు. అభివృద్ధి కావాలంటే వంశ పారంపర్య పాలనకు స్వస్తి పలకాలని చెప్పారు. యూపీలో ఇంతకుముందు కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌సింగ్‌ల హయాంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని, అదంతా ఇప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









