ఒత్తిడిని సులువుగా ప్రకృతి తగ్గిస్తుంది

- June 13, 2016 , by Maagulf
ఒత్తిడిని సులువుగా  ప్రకృతి  తగ్గిస్తుంది

నిత్యం క్షణం తీరిక లేని జీవితంలో ఎన్నో సవాళ్లు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఒత్తిడి ఆవహించడం సహజం. దాన్నుంచి తక్షణ ఉపశమనంగా ఏం చేయాలి అనేది చాలామందికి తెలియదు. మీ పరిస్థితీ అదే అయితే.. ఇలా ప్రయత్నించి చూడండి..
ఒ త్తిడిగా ఉన్నప్పుడు చెప్పుల్లేకుండా కాసేపు పచ్చని గడ్డిలో నడవండి. ఇలాంటప్పుడు ఫోను, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలేవీ చేతుల్లో లేకుండా చూసుకోండి. కనీసం పదినిమిషాలైనా పచ్చని చెట్ల మధ్య గడిపేందుకు ప్రయత్నించండి. ఇంటి ముందు తోట లేదా మొక్కల కుండీలు ఉంటే గనుక వాటికి పాదు పెట్టడం, కొమ్మలు కత్తిరించడం, నీళ్లు పెట్టడం లాంటివి చేయండి. ఈ పనులన్నీ ఒత్తిడిని సులువుగా దూరం చేస్తాయి. మనసు తేలిక పడుతుంది.
*
గజిబిజి ఆలోచనలతో మనసంతా చిందరవందరగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో నిమ్మ గుణాలున్న నూనెను కొన్ని చుక్కలు కలిపి స్నానం చేయండి. ఇది మనసుకు ఎంతో హాయినిస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధం చేస్తుంది.
*
క్షణం తీరిక లేని పనులతో సతమతమవుతున్నప్పుడు విపరీతమైన అలసట కూడా మొదలవుతుంది. కొన్నిసార్లు అదీ ఒత్తిడికి కారణం కావచ్చు. అలాంటప్పుడు ముందు ఆ పనికి కాస్త విరామం ఇవ్వండి. రెండుమూడు నిమిషాలు కళ్లుమూసుకుని ధ్యానం చేయండి. ఈ చిన్న ప్రయత్నం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ తరవాత చేసే పనిలో వేగం పెరుగుతుంది.
*
పొద్దున్నే లేదా సాయంత్రాలు సైకిలు తొక్కేందుకు ప్రయత్నించండి. ఇది వ్యాయామంలా ఉపయోగపడటమే కాదు, ఒత్తిడినీ చాలా సులువుగా తగ్గిస్తుంది. కనీసం ఇరవై నిమిషాలు సైకిలు తొక్కినా చాలు.. మార్పు మీకే తెలుస్తుంది. లేదంటే తాడాట ఆడేందుకు ప్రయత్నించండి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com