‘ఇస్మార్ట్’ బ్యూటీ ‘అపరిచితురాలు’ అయిపోయిందే.!

- July 09, 2024 , by Maagulf
‘ఇస్మార్ట్’ బ్యూటీ ‘అపరిచితురాలు’ అయిపోయిందే.!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పుణ్యమా అని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో పాటూ, ఇస్మార్ట్ బ్యూటీ ట్యాగ్ లైన్ కూడా తగిలించేసుకుంది అందాల భామ నభా నటేష్.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మని ‘అపరిచితురాలు’ అంటూ పిలుస్తున్నారు. అందుకు కారణం ఆమె నటిస్తున్న ‘డార్లింగ్’ చిత్రమే.
ప్రియదర్శి హీరోగా వస్తున్న చిత్రమిది. అశ్విన్ రామ్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రియదర్శికి ప్రియురాలిగా, భార్యగా నటిస్తోంది నభా నటేష్.
పెళ్లి తర్వాత భార్య చేతుల్లో కష్టాలు పడుతూ నలిగిపోయే భర్తగా ప్రియదర్శి కనిపించబోతున్నాడు. పెళ్లి తర్వాత ప్రతీ భర్త పనీ ఇంతేగా అనుకుంటారేమో. కానీ, ఈ సినిమాలో పాపం ప్రియదర్శి ముచ్చట అలా కాదు.
స్ల్పిట్ పర్సనాలిటీ అనే వ్యాధితో బాధపడే భార్య తను. పెళ్లి తర్వాతే ఆ విషయం బయటపడుతుంది. అప్పుడే ప్రేమ చూపించి, అప్పుడే చెప్పలేనంత ద్వేషం, క్రూరత్వం చూపిస్తుంటుంది. అయితే ఇదంతా ఫన్ టోన్‌లోనే చూపించాడనుకోండి డైరెక్టర్.
ఫన్‌తో పాటూ, అక్కడక్కడా కొంత సెంటిమెంట్ కూడా వున్నట్లు తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే, ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘డార్లింగ్’ నభా నటేష్‌కి ఎంత మేర ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com