దుబాయ్‌లో పునఃప్రారంభమైన మెట్రో సేవలు
- July 09, 2024
దుబాయ్: సోమవారం సాయంత్రం ఈక్విటీ మరియు మాక్స్ స్టేషన్‌ల మధ్య అంతరాయం ఏర్పడిన తర్వాత రెడ్ లైన్‌లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించయినట్టు దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలిగిందని పేర్కొంది. ప్రభావిత స్టేషన్లలో ప్రత్యామ్నాయ బస్సు సర్వీసులను అందించినట్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, మాక్స్ స్టేషన్ వైపు ప్రయాణించే రెడ్ లైన్‌లోని ప్రయాణికులను రైళ్ల నుండి బయటకు రావాలని కోరారు. ప్లాట్‌ఫారమ్‌లపై వేచి ఉన్నవారిని రైళ్లలో ఎక్కడానికి అనుమతించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంగళవారం ఉదయం 6.33 గంటలకు X లో ఒక పోస్ట్ ద్వారా రెడ్ లైన్‌లో సేవ పునరుద్ధరించినట్టు తెలియజేసారు. సహకరించినందుకు మెట్రో వినియోగదారులకు అధికార యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సరైన సమాచారం లేని కారణంగా చాలామంది ప్రయాణికులు తమ ఇండ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడినట్టు వాపోయారు. బిజినెస్ బే, దుబాయ్ మాల్, ఫైనాన్షియల్ సెంటర్, ఎమిరేట్స్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మ్యాక్స్, ఎడిసిబి, బుర్జుమాన్, యూనియన్, రిగ్గా మొదలైన స్టేషన్‌లు ఈ మార్గంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







