హెల్త్ ప్రాక్టీషనర్ లైసెన్స్ తొలగింపు.. SR20,000 జరిమానా
- July 09, 2024
సౌదీ: అనుమతి లేకుండా తనకు కేటాయించిన హాస్పిటల్ షిఫ్ట్ నుండి వైదొలిగిన ఆరోగ్య ప్రాక్టీషనర్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రమశిక్షణా చర్య తీసుకుంది. లైసెన్స్ రిజిస్టర్ నుండి అతని పేరును తొలగించారు. కనీసం రెండేళ్లపాటు కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేయకుండా నిషేధించారు. దీంతోపాటు అతడిపై SR20,000 జరిమానా విధించారు. మంత్రిత్వ శాఖ బృందాలు తీవ్రమైన ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
హెల్త్ ప్రొఫెషన్స్ ప్రాక్టీస్ లా ఆర్టికల్ 32 మరియు దాని ఎగ్జిక్యూటివ్ నిబంధనల ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. ఆరోగ్య సంరక్షణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, రోగి భద్రత మరియు ప్రజారోగ్యాన్ని నిర్ధారించడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







