బహ్రెయిన్ లో హై-అలర్ట్!
- July 03, 2015
తీవ్రవాద ముప్పు పొంచిఉన్నందున బహ్రెయిన్ రాజ్యమంతటా, ప్రత్యేకించి ముఖ్యమైన మసీదులలో పోలీసువారి పహారా తీవ్రతరం చేశారుశుక్రవారం ప్రార్ధనల నేపధ్యంలో, ప్రతి ఏరియాకు ఒక అధీకృత పోలీసు మేజర్ ఇంచార్జ్ ని నియమించారు. ఈయన, ఆయా మసీదుల యొక్క పెద్దలతో సమన్వయమై శాంతిభద్రతలను సమీక్షిస్తారు. ఈ వారాంతంలో బహ్రెయిన్ ను దాడికి లక్ష్యంగా చేసుకున్నట్టు - మతబోధకుడు, ఇస్లామిక్ స్టేట్ (IS) మిలిటెంట్ గ్రూప్ సేనియర్ ఐన షేక్ తుర్కీ ఆల్బినాలి సోషల్ మీడియా ద్వారా హెచ్చరించినట్టు సమాచారం. మే 22,29 లలో సౌదీ అరేబియా లోను, జూన్ 26న కువేట్ లోను ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి విదితమే! పోలీసు పహారాతో పాటు, వివిధ ప్రాంతాల పై నిఘా ఉంచడానికి సివిల్ డిఫెన్స్ లో తర్ఫీదు పొందిన కమ్యూనిటీ వాలంటీర్లను నియమించినట్టు కేపిటల్ గవర్నరేట్ పోలీసు డైరక్టర్ జనరల్ - బ్రిగడియర్ ఖలిద్ మొహమ్మద్ అల్ థావాదీ తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







