ఖతార్ జనాభా 2.85 మిలియన్లు.. 85 శాతం పెరుగుదల

- July 10, 2024 , by Maagulf
ఖతార్ జనాభా 2.85 మిలియన్లు.. 85 శాతం పెరుగుదల

దోహా: ఇటీవలి కాలంలో ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటుగా ఖతార్ జనాభా క్రమంగా పెరుగుతోంది. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ (NPC) గణాంకాల ప్రకారం.. మొత్తం జనాభా అక్టోబర్ 2008 చివరి నాటికి 1,541,130 నుండి జూన్ 30, 2024 నాటికి 2,857,822కి పెరిగింది.ఇది 85.4 శాతం పెరుగుదల కావడం గమనార్హం. NPC గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2024లో 3,128,983, మార్చి 2024లో 3,119,589,  ఏప్రిల్‌లో 3,098,866 మరియు మే నెలలో 3,080,804 జనాభా నమోదైంది.

జూన్ 2024 నాటికి పురుషుల జనాభా 2,070,164 - మొత్తం జనాభాలో 72.4 శాతం. మే 2024తో పోల్చితే జూన్ 2024లో నమోదైన మొత్తం జనాభా 7.2 శాతం తగ్గింది. వేసవి సెలవుల సీజన్ ప్రారంభంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు సెలవుల కోసం విదేశాలకు వెళ్లడం జూన్‌లో స్వల్పంగా తగ్గిందన్నారు. ఈ గణాంకాలు జూన్ 30, 2024 నాటికి ఖతార్ రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని వయసుల, ఖతారీలు మరియు నాన్-ఖతారీస్ వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి. ఇది జూన్ 30న రాష్ట్ర సరిహద్దుల వెలుపల ఉన్న ఖతార్ జాతీయులు లేదా నివాసితులను ఇందులో చేర్చలేదు.  జనాభాలో 25–64 ఏళ్ల వయస్సు గలవారు 73.2 శాతంగా ఉండగా, 65 ఏళ్లు పైబడిన వారు కేవలం 1.4 శాతం మాత్రమే. 15 ఏళ్లలోపు వారు జనాభాలో 14.3 శాతం ఉండగా, దేశ జనాభాలో 15-24 ఏళ్ల వయస్సు వారు 11.1 శాతం ఉన్నారు.

దేశంలో ఏప్రిల్ 2024లో 2,496 మంది పిల్లలు జన్మించారు. 221 మరణాలు నమోదయ్యాయి. దేశంలో పర్యాటకం, విశ్రాంతి మరియు వ్యాపార ప్రయోజనాల కోసం సందర్శకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున కూడా జనాభా పెరుగుదల కనిపిస్తోందన్నారు. మొత్తం ఇన్‌బౌండ్ సందర్శకుల సంఖ్య ఏప్రిల్ 2024లో దాదాపు 382,000కి చేరుకుంది. నెలవారీ పెరుగుదల 16.3 శాతం (మార్చి 2024తో పోలిస్తే) మరియు వార్షిక పెరుగుదల 17.9 శాతం (ఏప్రిల్ 2023తో పోలిస్తే) నమోదైంది.

అత్యధిక సంఖ్యలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల నుండి 42 శాతం మంది సందర్శకులు వచ్చివెళ్లారు. అరబ్ మరియు జిసిసి రాష్ట్రాలు కాకుండా ఆసియా,  ఓషియానియా దేశాల నుండి 22.9 శాతం, యూరప్ నుండి 19.2 శాతం, జిసిసి కాకుండా ఇతర అరబ్ దేశాల నుండి 8 శాతం, అమెరికా నుండి 6.2 శాతం ప్రయాణులు వచ్చివెళ్లారు. నౌకాశ్రయం ద్వారా సందర్శకుల విషయానికొస్తే.. మొత్తం సందర్శకుల సంఖ్యలో ఇది 55 శాతం. అత్యధిక శాతం మంది వాయుమార్గం వచ్చిన వారు ఉన్నారని జాతీయ ప్రణాళికా మండలి తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com