‘ఇండియన్ 2’ ప్రమోషన్లలో కాజల్ అందుకే కనిపించడం లేదట.!

- July 10, 2024 , by Maagulf
‘ఇండియన్ 2’ ప్రమోషన్లలో కాజల్ అందుకే కనిపించడం లేదట.!

‘ఇండియన్ 2’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటూ ప్రచారం జరిగింది. కానీ, ఇండియన్ 2 రిలీజ్‌కి సిద్ధమవుతున్నా.. ఎక్కడా కాజల్ అలికిడి కనిపించడం లేదు. దాంతో, కాజల్ ఈ సినిమాలో లేదని ఫిక్స్ అయిపోయారంతా.

లేదంటే కాజల్ క్యారెక్టర్‌ని సీక్రెట్‌గా వుంచారా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కొందరైతే. తాజాగా ‘ఇండియన్ 2’ ఈవెంట్‌లో భాగంగా శంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.

‘ఇండియన్ 2’ తో పాటూ, మూడో పార్ట్ కూడా సైమల్టేనియస్‌గా సిద్దమైపోయిందని టీమ్ మాటల్లో అర్ధమవుతోంది. సో, ఇండియన్ 2లో కాజల్ పాత్రకు చోటు లేదట. మూడో పార్ట్‌లో మాత్రమే కాజల్‌ నటించిందట. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ శంకరే ప్రస్థావించారు.

దాంతో, ‘ఇండియన్ 2’ సినిమాకి సంబంధించి కాజల్ పాత్రపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ పార్ట్‌కి సంబంధించినంత వరకూ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. కమల్ హాసన్ మెయిన్ లీడ్ పోషించగా యంగ్ హీరో సిద్దార్ధ్ కీలక పాత్ర పోషించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com