సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కోసం ప్రబాస్ గెటప్ అలా వుండబోతోందా.?
- July 10, 2024
‘యానిమల్’ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా, ప్రబాస్‌తో చేయబోయే సినిమా పేరే ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా టేకింగ్, ఆయన సినిమాల్లోని హీరోల స్టైలింగ్ అండ్ ఆటిట్యూడ్ ఎలా వుండబోతోందో ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు చూసేశాం.
ఆయన చేసే సినిమాల్లో ఏం మ్యాజిక్ వుంటుందో అన్న సంగతి పక్కన పెడితే, ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే అన్న నమ్మకాలు ఎక్కువగా ఏర్పడిపోయాయ్.
తిట్టుకున్నా ఆయన సినిమాని ప్రశంసించే విమర్శకుల సంఖ్య కూడా ఎక్కువే.
అలాంటి డైరెక్టర్ చేతిలో ప్రబాస్ సినిమా అంటే ఎలా వుండబోతోందో కదా. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ దాదాపు కంప్లీట్ అయిపోయిందట. త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్ధంగా వున్నాడు సందీప్ వంగా.
‘కల్కి’ మూడ్ నుంచి బయటికొచ్చేసిన ప్రబాస్ ‘రాజా సాబ్’ షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. అలాగే నెక్స్‌ట్ సందీప్ రెడ్డి వంగా సినిమాకి సిద్ధమవుతాడనీ సమాచారం.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రబాస్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి హాలీవుడ్ రేంజ్ పవర్ ఫుల్ డాన్ గెటప్, మరియు వింటేజ్ లుక్స్‌లో పక్కా మాస్ గెటప్‌లో కనిపించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. డాన్ గెటప్ అంటే ఫ్యాన్స్‌కి ‘బిల్లా’ గెటప్ గుర్తుకొస్తోంది. కానీ, అంతకు మించి అనేలా వుంటుందని సందీప్ రెడ్డి వంగా సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







