తెలంగాణ ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు..

- July 10, 2024 , by Maagulf
తెలంగాణ ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC)లో 3035 ఉద్యోగాల భ‌ర్తీకి ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలో టీజీఎస్ ఆర్టీసీ ఈ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై దృష్టి సారించింది.ఇంకా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌లేదు. అయితే.. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌లైంద‌ని, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

వీటిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ స్పందించారు.అవ‌న్నీఫేక్ అని చెప్పారు. ఉద్యోగార్థులు ఆ లింక్‌ల‌ను న‌మ్మి పోస‌మోవ‌ద్ద‌ని చెప్పారు. ఆయా లింక్‌ల‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేయొద్దు అని సోష‌ల్ మీడియా వేదిక‌గా సూచించారు.

‘రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్ ఆర్టీసీ ప్రారంభించింది.3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దని TGSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.’ అని ఎక్స్‌లో స‌జ్జ‌నార్ పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన 3035 పోస్టుల్లో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.మొత్తం పోస్టుల్లో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (2) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, DM/ATM/మెకానికల్/ఇంజనీర్ 40, డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ 25, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06 ఉద్యోగాలు ఉన్నాయి.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com