చేపలు తింటే గుండె సమస్యలు దూరంగా వుంటాయా.?

- July 10, 2024 , by Maagulf
చేపలు తింటే గుండె సమస్యలు దూరంగా వుంటాయా.?

నాన్‌వెజ్ తినేవారికి చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపల కూర, పులుసు, ఫ్రై.. ఇలా అనేక రకాలుగా వండి తినే నాన్ వెజ్ వంటకం చేప. అయితే, చేపలను తినడం వల్ల కలిగే లాభాలేంటీ.?

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుంటాయ్. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయ్.అనవసరమైన కొవ్వు కణాలు పెరగకుండా చేస్తాయ్. అంటే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులు రాకుండా వుండాలంటే ఖచ్చితంగా చేపలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు, చేపల్లో మెగ్నీషియం అధికంగా వుంటుంది. ఇది శరీరానికి సరిపడా లేకపోతే, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అదేంటీ.? మెగ్నీషియానికి కాల్షియానికి సంబంధం ఏంటంటారా.? శరీరంలోని కాల్షియం మెటబాలిజాన్ని సమతుల్యం చేయడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. తద్వారా సరిపడా మెగ్నీషియం వుంటేనే కాల్షియం లెవల్ కూడా బాగుంటుంది.

చేపలు తరచూ తినేవారిలో కీళ్ల నొప్పుల సమస్యలు కూడా తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని అధిక ఉస్ణోగ్రతని తగ్గించడానికి కడుపులో మంట, అల్జీమర్స్, డిప్రెషన్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా చేపలు ఎక్కువగా తినేవారిలో తక్కువ అని తాజా సర్వేలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com