సంచలనాత్మక దర్శకుడు

- July 11, 2024 , by Maagulf
సంచలనాత్మక దర్శకుడు

అతనికి తమిళ సినిమాల్లో దర్శకుడిగా ఇతడికి మంచి క్రేజ్ ఉంది.తాను అనుకున్నట్టుగా సినిమా తీయడం కోసం ఏదైనా చేస్తాడు.ఎవరినైనా పీకేస్తాడు.హీరోలను మార్చడం, హీరోయిన్స్ ని ఎంచుకోవడం లో ఇబ్బంది పడటం అనేది ప్రతి సినిమాకు జరుగుతుంది.ఇక అయన క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం ప్రాణం అయినా పెడతాడు.ఆయన మరెవరో కాదు సంచలనాత్మక కేరాఫ్ నిలిచిన దిగ్గజ కోలీవుడ్ దర్శకుడు బాలా. నేడు ఆయన పుట్టిన రోజు.

బాలా పూర్తి పేరు బాల పళనిస్వామి.1966,జులై 11వ తేదీన తమిళనాడులోని మదురైలో జన్మించాడు. మదురైలోని అమెరికన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లి ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాలు మహేంద్రన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. బాలు మహేంద్రన్ వద్ద డైరెక్షన్ డిపార్టుమెంట్ మీద పట్టు సాధించిన తర్వాత 1999లో తాను స్వయంగా రాసుకున్న కథతో అప్పటి యువ నటుడు విక్రమ్ హీరోగా సేతు చిత్రాన్ని రూపొందించగా ఆ చిత్రం సంచనల విజయం సాధించి విక్రమ్ మరియు బాలాలకు మంచి గుర్తింపు తెచ్చింది.

2001లో సూర్య హీరోగా వచ్చిన నంద సైతం మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత విక్రమ్, సూర్యలతో తీసిన " పీత మగన్" (తెలుగులో శివపుత్రుడు ) చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. సాధారణంగా రెండేళ్లకు ఒక సినిమా తీస్తాడు బాల.కానీ హీరోలను, హీరోయిన్స్ ని, నిర్మాతలను మార్చుతూ నేనే దేవుణ్ణి సినిమా ఏకంగా ఐదేళ్లు తీసాడు.ఇక అతడి ఇమాజినేషన్ లో ఏది ఉంటే అది చేయాల్సిందే. దాని కోసం ఎంత కష్టం అయినా పడతాడు.చివరికి ఆయన్ను ఒక వర్గం హీరోలు మాత్రమే ఇష్టపడుతుండటం విశేషం.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోలు విక్రమ్ , సూర్య, అధర్వ, ఆర్య .ఇలాంటి హీరోలు మాత్రమే అతడితో మళ్లి కలిసి పని చేయడానికి ఇష్టపడతారు.చాల మంది అతడితో ఒక్క సినిమా లో అయినా నటించాలనుకుంటారు కానీ మరో సినిమా తో ముందుకు రావాలంటే బయటపడతారు.25 ఏళ్ళ కెరీర్ లో కేవలం 13 సినిమాలు మాత్రమే తీసిన బాల చాల వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. అయినప్పటికీ ఆయన తీసిన చిత్రాలు బుల్లితెరపై ప్రేక్షకులను నిరంతరం అలరిస్తూనే ఉన్నాయి. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com