ఐదేళ్లలో మిలియనీర్లకు అడ్డాగా యూఏఈ..!
- July 11, 2024
యూఏఈ: ఐదేళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు 6,000 మంది మిలియనీర్‌లు యూఏఈ చేరుకుంటున్నారు. స్విస్ బ్యాంక్ UBS విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం.. $1 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తులున్న మిలియనీర్ల సంఖ్య దాదాపు 29,866 లేదా 15 శాతం పెరిగి 2023లో 202,201 నుండి 2028లో 232,067కి చేరుకుంటుంది.ఇటీవల యూఏఈలోకి 6,700 మంది మిలియనీర్లు తరలివచ్చారు.
జర్మనీ, హంగరీ, ఖతార్, సింగపూర్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, చైనా, గ్రీస్, నెదర్లాండ్స్ మరియు యుకే కంటే యూఏఈకి మిలియనీర్ల వలసలు అధికంగా ఉన్నాయి. తైవాన్, టర్కీ, కజకిస్తాన్, ఇండోనేషియా, జపాన్ 2023 మరియు 2028 మధ్య మిలియనీర్ల అధిక శాతం వృద్ధితో ముందుంటాయని అంచనా వేస్తున్నారు.సౌదీ అరేబియాలో మిలియనీర్ల సంఖ్య కూడా 5 సంవత్సరాలలో 15 శాతం పెరుగుతుందని స్విస్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది 2023లో 351,855తో పోలిస్తే 2028లో 403,8784కి చేరుకుంతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







